Pages

Thursday, 30 June 2016

Fonts

www.dafont.com
ఇదో ఫాంట్‌ల స్థావరం. రంగాల వారీగా ఫాంట్‌లను వెతకొచ్చు. ఉదాహరణకు టెక్నాలజీకి సంబంధించిన డిజైన్స్‌కి సరిపడే ఫాంట్‌ల కోసం Techno విభాగంలో చూడొచ్చు. పండగలకు ఏవైనా గ్రీటింగ్‌ కార్డులు చేస్తున్నట్లయితే Holiday మెనూలోకి ఫాంట్‌లను ప్రయత్నించొచ్చు.
www.1001fonts.com
సుమారు 12,000 ఫాంట్‌లున్నాయి. మీరు వాడుతున్న ఓఎస్‌ ఏదైనా ఫాంట్‌లను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసి వాడుకోవచ్చు. విభాగాలుగా ఫాంట్‌లను బ్రౌజ్‌ చేసేందుకు Font Categories ఉంది. ఫాంట్‌ పేరుతో వెతికేందుకు సెర్చ్‌ ఉంది.
www.fontspring.com
లెక్కకు మిక్కిలి ఫాంట్‌ల్ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఉచితంగా అందుబాటులో ఉన్నవాటిని డౌన్‌లోడ్‌ చేసి వాడుకోవచ్చు. ఫాంట్‌లను పొందేందుకు సైట్‌లో సభ్యులవ్వాల్సిందే.
www.fontfabric.com
ఉచిత, ప్రీమియం ఫాంట్‌లు జాబితాలో ఉన్నాయి. అన్ని ఉచిత ఫాంట్‌ల కోసం Categories మెనూలోని ‘ఫ్రీ’ లింక్‌పై క్లిక్‌ చేయండి. 53 ఉచిత ఫాంట్‌ల జాబితాని పొందొచ్చు.
www.fontshop.com
హోంపేజీలో విభాగాలుగా ఫాంట్‌ల జాబితాని చూడొచ్చు. బ్రౌజ్‌ చేసి కావాల్సిన వాటిని కొని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉచిత ఫాంట్‌లకు Free Fonts విభాగం ఉంది.
https://fontbundles.net
ప్రీమియం, ఉచిత ఫాంట్‌లను గుత్తగా అందిస్తున్నారు. సైట్‌లో సభ్యులై ప్రత్యేక విభాగం నుంచి ఉచిత ఫాంట్‌లను పొందొచ్చు.
www.theleagueofmoveabletype.com
ఇదో ఓపెన్‌ సోర్స్‌ కమ్యూనిటీ. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఫాంట్‌లను పొందొచ్చు. మీరు డిజైనర్‌ అయితే సైట్‌లో సభ్యులై మీవైన ఫాంట్‌లను అప్‌లోడ్‌ చేయవచ్చు.
www.hypefortype.com
దీంట్లో సుమారు 25,000 ఫాంట్‌లు ఉన్నాయి. ఉచిత ఫాంట్‌ల కోసం ‘బ్రౌజ్‌ ఫాంట్స్‌’ విభాగంలోకి వెళ్లి Free Fonts సెలెక్ట్‌ చేయండి.
http://freebiesbug.com
ఇదో ఉచిత డిజైన్ల బ్లాగు. పీఎస్‌డీ ఫార్మెట్‌లో హై క్వాలిటీ గ్రాఫిక్‌ డిజైన్లను పొందొచ్చు. ఇదే మాదిరిగా ఉచిత ఫాంటúలనూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
https://pixelbuddha.net
డిజైనర్లకు ఉపయోగపడే మెటీరియల్‌తో పాటు కొన్ని ఉచిత ఫాంట్‌లను పొందొచ్చు. ప్రత్యేక ఐకాన్లు, వెక్టార్‌ డిజైన్స్‌ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు.

No comments:

Post a Comment

Related ...